Share this on your social network:
Published:
16-04-2019

బీజేపీకి సహకరిస్తున్నారా : సీట్ల పంపకాల విషయంలో రాహుల్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్

ఢిల్లీ: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. అదే సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్‌కు కౌంటర్ ఇస్తోంది.

కాంగ్రెస్ 
ఆప్ కోర్టులో బంతి

కాంగ్రెస్ ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో సందిగ్దత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బంతిని అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో వేశాడు. ఇక సీట్ల పంపకాల్లో జాప్యం చేస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీనే అంటూ ట్వీట్ చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్ అవుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్‌ల మధ్య పొత్తు కుదిరే పరిస్థితి వస్తే కాంగ్రెస్ 4 సీట్లు ఆప్‌కు కేటాయించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అయితే కేజ్రీవాల్ మాత్రం ఇంకా జాప్యం చేస్తున్నారని. సమయం దగ్గరపడుతోందని చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పటికీ కాంగ్రెస్ తలుపులు తెరిచే ఉందని చెప్పారు.

ఆప్ 
రాహుల్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్

ఇదిలా ఉంటే సీట్ల పంపకాల్లో జాప్యానికి కారణం కాంగ్రెస్‌ అంటూ రివర్స్ అటాక్‌ చేశారు కేజ్రీవాల్. కాంగ్రెస్ సీట్ల పంపకాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందంటూ వాపోయారు అరవింద్ కేజ్రీవాల్. అసలు పొత్తులపై కాంగ్రెస్ సీరియస్‌గా లేదని ఆయన ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కూడా ఎస్పీ బీఎస్పీలతో పొత్తు పెట్టుకోకుండా మోడీ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్ చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఇక రాహుల్ కు వెంటనే కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. "మీరు చేసిన ట్వీట్‌ను పరిశీలిస్తే చర్చలు ఇంకా జరుగుతున్నాయనే తెలుస్తోంది. పొత్తు మీకు ముఖ్యం కాదనేలా అర్థమవుతోంది. ఈరోజు మోడీ అమిత్ షాల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఇతర రాష్ట్రాల్లో మోడీ వ్యతిరేకత ఓట్లను చీల్చడం చాలా బాధాకరం " అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ వ్యూహం 
పొత్తు కుదిరితే ఇదీ కాంగ్రెస్ ప్లాన్ ..!

ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా... నాలుగు స్థానాలను ఆమ్‌ఆద్మీ పార్టీకి కేటాయించారు రాహుల్ గాంధీ. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడా సీట్ల పంపకాల విషయంలో మాత్రం కేజ్రీవాల్ మొత్తం 33 లోక్‌సభ స్థానాలు కావాలని పట్టుబడుతున్నారు. అంటే ఢిల్లీ, పంజాబ్, హర్యానా గోవా రాష్ట్రాల్లో 33 లోక్‌సభ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు కేజ్రీవాల్. ఒకవేళ రాహుల్ గాంధీ 3:4 సీట్ల ఫార్ములా వర్కౌట్ అయితే... ఢిల్లీలో మాజీ కేంద్ర మంత్రులు అజయ్ మాకెన్, కపిల్ సిబల్‌ను పోటీలో నిలిపే యోచన కాంగ్రెస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మరో స్థానం నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రధాన అనుచరుడు మాజీ మంత్రి రాజ్‌కుమార్ చౌహాన్‌ను కూడా బరిలో దింపే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.

ఇక ఇప్పటికే ఆప్ ఏడు స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఒక వేళ పొత్తు కుదిరితే చాందిని చౌక్ నుంచి పంకజ్ గుప్తాను . న్యూఢిల్లీ నుంచి బ్రజేష్ గోయెల్, నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి గుగన్ సింగ్‌ల పేర్లను జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇక్కడ చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ కపిల్ సిబల్‌ను న్యూఢిల్లీ నుంచి అజయ్ మాకెన్‌ను నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి రాజ్‌కుమార్ చౌహాన్‌లను బరిలో నిలపేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఇక ఢిల్లీ లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసేందుకు చివరి రోజు ఏప్రిల్ 23. సమయం తక్కువగా ఉండటంతో రోజురోజుకీ ఇటు కార్యకర్తల్లోను అటు అభ్యర్థుల్లోను టెన్షన్ పెరిగిపోతోంది. అసలు పొత్తు ఉంటుందా లేదా అనేదానిపై కూడా కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది.

Related ImagesRelated News


వీడిన ఎస్పీ సంక్షోభం.. అఖిలేశే మళ్లీ సీఎం

రాబోయే బడ్జెట్‌ ఆర్థిక స్థిరీకరణకే ప్రాధాన్యమిస్తుందని, అంతర్జాతీయ


బాంబు పేల్చిన బాబాయ్.. వీడియో రిలీజ్

రాబోయే బడ్జెట్‌ ఆర్థిక స్థిరీకరణకే ప్రాధాన్యమిస్తుందని, అంతర్జాతీయ


నోట్లరద్దు సిగ్గుమాలిన ఫ్లాప్ షో

రాబోయే బడ్జెట్‌ ఆర్థిక స్థిరీకరణకే ప్రాధాన్యమిస్తుందని, అంతర్జాతీయ


త్వరలో ‘బినామీ’ చట్టం

రాబోయే బడ్జెట్‌ ఆర్థిక స్థిరీకరణకే ప్రాధాన్యమిస్తుందని, అంతర్జాతీయ


కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట

కాంగ్రెస్‌లో రెండేళ్ల ముందుగానే టిక్కెట్ రేసులో మూడు ముక్కలాట మొదలై


సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్.

అక్రమాస్తుల కేసులో వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్&


బండారు వ్యాఖ్యలపై మండిపడ్డ గడ్డి ఈశ్వరి!

టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి పై వైసీపీ ఎమ్మెల్యే గడ్డి ఈశ్వరి త


సీఎం రమేష్‌పై ఆదినారాయణరెడ్డి పెత్తనం

కడప జిల్లా టీడీపీలో మరో కలకలం రేగింది. టీడీపీలోకి ఫిరాయించి ఆ తర్వాత మ


మా కాఫీ తాగి మమ్మల్నే గెంటేస్తున్నారు. కనీస వసతుల ఊసే లేదు

• బాక్సైట్ తవ్వితే ఊళ్ళు వదిలిపోవాల్సి వస్తుంది • రోగం వచ్చి 108కి ఫోన


రాజకీయాల్లోకి శ్రీరెడ్డి? అందుకే మెగా ఫ్యామిలీ గురించి ఇలా...

తెలుగు సినిమారంగంలో క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నిర్మాతలు, హీరోలు, ఇండస్


YCPలోకి ఇద్దరు మంత్రులు?

ఏపీ రాజకీయాల్లో ఆఖరాట ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఆపరేషన్


మోదీని బజారుకీడుస్తాం.. టీడీపీ నెలరోజుల డెడ్‌లైన్!

'ఎయిర్ ఏషియా' ఆడియో టేపుల ఉక్కపోత నుంచి బైటపడ్డానికి.. బీజేపీ మీద టీడ


అభ్యంతరాలు ఉన్నప్పుడు ఒప్పందంపై ముందుకెళా వెళ్లారు: రాహుల్ గాంధీ సూటి ప్రశ్న

లోక్‌సభలో మళ్లీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం రచ్చకు దారి తీసిం


అభిమాని అత్యుత్సాహం.. కిందపడిన పవన్‌!

విజయనగరం: విజయనగరంలో జనసేన బహిరంగ సభలో ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించి ఈసారి అధికారం చేపట్టేందుకు వైస


వయనాడ్‌లో రాహుల్ గాంధీ నిజంగాే పాకిస్తాన్ జెండాను ఎగరేశారా?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళ వయనాడ్ లోక్‌సభ స్థానానికి నా


మోడీని నేను తిట్టినట్టు ఎవరూ తిట్టలా... : బాలయ్య

సినిమాల్లోనే కాదు బాలయ్య ఇప్పుడు ప్రచారాల్లో కూడా పంచ్ డైలాగ్స్ తో దు


రాహుల్‌జీ..మీ బయోపిక్‌లో హీరోయిన్‌ ఎవరుండాలి?

కాంగ్రెస్‌ అధ్యక్షుడి సమాధానం ఏంటో తెలుసా.. పుణె: ఇప్పుడు బయోపిక్‌ల


బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా వివేక్ ఒబెరాయ్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శుక్రవారం 40 మందితో కూడిన స్టార్


జనసేన ఈ స్థానాల్లోనే ఆ పార్టీని దెబ్బ కొడుతుందా...!

తొలి సారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఏపీలో కమ్యూనిష్టుల


చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారు: డొక్కా

గుంటూరు: అత్యధిక సీట్లతో చంద్రబాబు మరోసారి సీఎం కాబోతున్నారని టీడీప


అనంతపురం, తూ.గో, ప.గో అభిమానాన్ని అలుసుగా తీసుకున్నందుకు ప్రజల ప్రతీకారమేనా ఈ ఓటమి..!

సినిమా హీరో శివాజీ అధికారికంగా పసుపు కండువా కప్పుకోపోయినా గత రెండు సం


బీజేపీకి సహకరిస్తున్నారా : సీట్ల పంపకాల విషయంలో రాహుల్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన కేజ్రీవాల్

ఢిల్లీ: కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య వివాదం ఇప్పుడప్పుడే సద్దుమణి


రాజకీయాల్లో మర్యాద అనేది అరుదైన గుణం

నిర్మలాసీతారామన్‌ అందుకు ఉదాహరణ అన్న శశిథరూర్‌ తిరువనంతపురం: తులాభ


ఎడిటోరియల్ : చంద్రబాబు ప్లాన్ వర్కవుటయ్యుంటే జగనూ ఓడిపోయేవాడేనేమో ?

అవును వెలుగులోకి వస్తున్న విషయాలు చూస్తుంటే అదే అనుమానం పెరిగిపోతోంద


బీజేపీలో చేరిన సాధ్వి ప్రగ్యా.. దిగ్విజయ్‌పై పోటీ!

హైదరాబాద్‌ : బీజేపీ సీనియర్‌ నాయకులైన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రా